పల్లవి: |
మాధుర్యమే నా ప్రభుతో జీవితం |
మహిమానందమే-మహా ఆశ్చర్యమే |
...మాధుర్యమే... |
1. |
సర్వ శరీరులు గడ్డీని పోలిన వారైయున్నారు (2X) |
వారి అందమంతయు పువ్వు వలె |
వాడిపోవును-వాడిపోవును |
...మాధుర్యమే... |
2. |
నెమ్మది లేకుండ విస్తారమైన ధనముండుట కంటే (2X) |
దేవుని యందలి భయ భక్తులతో |
ఉండుటే మేలు-ఉండుటే మేలు |
...మాధుర్యమే... |
3. |
వాడబారని కిరీటమునకై నన్ను పిలిచేను (2X) |
తేజోవాసులైన పరిశుధ్ధులతో |
ఎపుడు చేరెదనో-ఎపుడు చేరెదనో |
...మాధుర్యమే... |