పల్లవి: |
కుతూహల మార్భాటమే - నా యేసుని సన్నిధిలో |
ఆనంద మానందమే - నా యేసుని సన్నిధిలో |
...కుతూహల... |
1. |
పాపమంత పోయెను - రోగమంత తొలగెను యేసుని రక్తములో |
క్రీస్తునందు జీవితం - కృప ద్వార రక్షణ పరిశుద్ధాత్మలో (2X) |
...కుతూహల... |
2. |
దేవాది దేవుడు ప్రతిరోజు నివసించె దేవాలయం నేనే |
ఆత్మలోన దేవుడు - గుర్తించె నన్ను అద్భుత మద్భుతమే (2X) |
...కుతూహల... |
3. |
శక్తినిచ్చు యేసు - జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును |
ఏకముగా కూడి, హోసన్న పాడి - ఊరంత చాటెదము (2X) |
...కుతూహల... |
4. |
భూరధ్వనితో పరిశుద్ధులతో - యేసు రానైయుండె |
ఒక్క క్షణములోనె, రూపాంతరము పొంది - మహిమలో ప్రవేశిద్దాం (2X) |
...కుతూహల... |