పల్లవి: |
కుమ్మరి ఓ కుమ్మరి - జగదుత్పత్తిధారి |
జిగటమన్నైన నా వంక - చల్లగ చూడుమయ్యా-ఆ... చల్లగ చూడుమయ్యా |
1. |
పనికి రాని పాత్రయని - పారవేయకుమా |
పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా (2X) |
సువార్తలోని పాత్రలన్ని - శ్రీ యేసుని పొగడుచుండ |
సాక్షిగానుండు పాత్రగజేసి - సత్యముతో నింపుము తండ్రి |
ఆ... సత్యముతో నింపుము తండ్రి |
...కుమ్మరి... |
2. |
విలువ లేని పాత్రను నేను- కొనువారు లేరెవ్వరు |
వెలలేని నీదు రక్తంబుతో- వెలుగొందు పాత్రగజేసి (2X) |
ఆటంకములనుండి తప్పించి నన్ను- ఎల్లప్పుడు కావుమయ్యా |
పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్యా |
ఆ...సరిచేసి వాడుమయ్యా |
...కుమ్మరి... |
3. |
లోకాశతో నిండి ఉప్పొంగుచూ- మార్గంబు నే దప్పితి |
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే- మనశ్శాంతి కోల్పోతిని (2X) |
పోగొట్టుకున్న పాత్రయనుచు - పరిగెత్తి నను పట్టితివి |
ప్రాణంబు నాలొ ఉన్నప్పుడే - నీ పాదంబుల్ పట్టితిన్ |
ఆ...నీ పాదంబుల్ పట్టితిన్ |
...కుమ్మరి... |