« కృపామయుడా - నీలోనా
Krupamayuda neelona
share with whatsapp

పల్లవి:
కృపామయుడా - నీలోనా - నివసింప జేసినందునా    (2X)
యివిగో నా స్తుతుల సింహాసనం - నీలో నివసింప జేసినందునా    
...కృపా...
1.
ఏ అపాయము నా గుడారము సమీపించనియ్యక    (2X)
నా మార్గములన్నిటిలొ.. - నీవె ఆశ్రయమైయుండగా    (2X)
...కృపా...
2.
చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలిచిన తేజోమయా    (2X)
రాజవంశములో.. - యాజకత్వము చేసేదను    (2X)
...కృపా...
3.
నీలో నిలచి ఆత్మఫలములు ఫలియించుట కొరకే    (2X)
నాపైనా నిండుగా.. ఆత్మవర్షము క్రుమ్మరించు    (2X)
...కృపా...
4.
ఏ యోగ్యత లేని నాకు - జీవకిరీటమిచ్చుటకు    (2X)
నీ కృప ననువీడకా.. - శాశ్వత కృపగా మారెను    (2X)
...కృపా...