పల్లవి: |
జుంటి తేనె కన్నా తీయనిది - వెండి పసిడి కన్నా మిన్న అది |
పొంగి పొర్లుచున్న ప్రేమ అది - యేసు నీ నామము |
సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది - పండు వెన్నెల కన్నా నిర్మలమైనది |
మంచు కొండలకన్న చల్లనిది - యేసు నీ నామము |
1. |
యేసు అసాధ్యుడవు నీవు - మరణాన్నే జయించిన వీరుడవు |
సర్వాన్నీ శాసించే యోధుడవు - నీకు సాటి లెరెవరు |
రక్షకా నీవేగా మా బలము - దేవా మా దాగు స్థలము నీవే |
నీవే నిజమైన దేవుడవు - ప్రణమిల్లి మ్రొక్కెదము |
...జుంటి... |
2. |
ఆకాశముకన్నా విశాలమైనది - విశ్వమంతటిలో వ్యాపించియున్నది |
ఊహలకందనిది, ఉన్నతమైనది - యేసు నీ నామము |
లోకమంతటికి రక్షణ మార్గము - జనులందరిని బ్రతికించు జీవము |
సర్వ కాలములో నివసించు సత్యము - యేసు నీ నామము |
...జుంటి... |