పల్లవి: |
జయ రాజు యేసు జండ క్రింద సేవకు వస్తిమి |
భయంలేక పరమ బలమొంది మనము పనిని జేయుదము |
అను పల్లవి: |
జయగీతం పాడి యుద్దము జేసి జయము నొందెదము |
...జయ రాజు... |
1. |
సేన నాయకుడు నడిపించెను మమ్మును దివ్యజ్ఞానముతో |
దీన సేవకులమై దినములు వెంబడించి పనిని చేయదము |
...జయగీతం... |
2. |
దేశవాసులెల్లరు దేవునితో సహవాస మొందుటకే |
వంచించు సైతాన్ వలనుండి వారిని విడిపించుట మా పని |
...జయగీతం... |
3. |
సర్వలోకమంతయు నెప్పుడు యేసుకు స్వంత మగుచున్నదో |
అంధకారం తొలగి వెలుగొందు కాలము తొందరలో రావలెను |
...జయగీతం... |