పల్లవి: |
జయ జయ యేసు జయ యేసు - జయ జయ క్రీస్తు జయ క్రీస్తు |
జయ జయ రాజా జయ రాజా - జయ జయ స్తోత్రం జయ స్తోత్రం |
1. |
మరణము గెల్చిన జయ యేసు - మరణము ఓడెను జయ యేసు |
పరమ బలమొసగు జయ యేసు - శరణము నీవె జయ యేసు |
...జయ... |
2. |
సమాధి గెల్చిన జయ యేసు - సమాధి ఓడెను జయ యేసు |
సమరము గెల్చిన జయ యేసు - అమరమూర్తివి జయ యేసు |
...జయ... |
3. |
బండను గెల్చిన జయ యేసు - బండయు ఓడెను జయ యేసు |
బండలుదీయుము జయ యేసు - అండకు జేర్చుము జయ యేసు |
...జయ... |
4. |
ముద్రను గెల్చిన జయ యేసు - ముద్రయు ఓడెను జయ యేసు |
ముద్రనుదీయుము జయ యేసు - ముద్రించుము నను జయ యేసు |
...జయ... |
5. |
కావలిగెల్చిన జయ యేసు - సాతాను ఓడెను జయ యేసు |
పాతవి గతియించె జయ యేసు - దాతవి నీవె జయ యేసు |
...జయ... |
6. |
సాతాను గెల్చిన జయ యేసు - సాతాను ఓడెను జయ యేసు |
సేవలొ బలము జయ యేసు - జీవము నీవె జయ యేసు |
...జయ... |