« ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు
Ishrayeluni kaapade dhevudu kunukadu
share with whatsapp

పల్లవి:
ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు    (2X)
అను పల్లవి:
భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా   
మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా   
...ఇశ్రాయేలును...
1.
ఇత్తడి తలుపులను ఇనుప గడియలను - మా దేవుడే పగులగొట్టును   
మా ముందర ఆయన నడుచును - ఈ భూమిని మేం స్వతంత్రించను    (2X)
రహస్యమందలి ఆత్మల ధనము - ప్రపంచపు కోట్లాది జనము    (2X)
మాకు సొత్తుగా స్వాస్థ్య ధనముగా - ఇచ్చెను ప్రభువు ఇది సత్యం ఆమెన్   
...భూమి...
2.
జలములలో బడి మేము దాటిన - అగ్నిలో బడి మేం నడచినా   
ఏ అపాయము మా దరి చేరదు - యేసు రక్తపు కవచముండగా    (2X)
ఎడారి నేలను సెలయేళ్ళుగా - అరణ్య భూమిని నీటి మడుగుగా    (2X)
చేయును ప్రభువు కుమ్మరించి - కడవరి వర్షము ఇది సత్యం ఆమెన్   
...భూమి...
3.
పగలు ఎండైనా రాత్రి వెన్నెలైన - ఏ దెబ్బైన తగులనియ్యడు   
చీకటి బాణమైనా ఏ తెగులైనా - మా గు-డారమును చేరనీయడు    (2X)
మా పాదములకు రాయి తగులకుండగా - మా మార్గములలో మాకు తోడుండగా    (2X)
తన దూతలకు ఆజ్ఞాపించును - మాకై ప్రభువు ఇది సత్యం ఆమెన్   
...భూమి...
4.
మాకు విరోధముగా రూపింపబడిన - ఏ ఆయుధము వర్ధిల్లదు   
మా మార్గము అంతకంతకు - దైవ మహిమతో వర్ధిల్లును    (2X)
మా తలలపై నిత్యానందము - మా నోటిలోను తన గీతము    (2X)
ఉంచెను ప్రభువు అభిషేకించి - తన మహిమార్ధం ఇది సత్యం ఆమెన్   
...భూమి...
5.
సడలిన చేతులను తొట్రిల్లు మోకాళ్ళను - యేసుని పేరిట బలపరచెదం   
తత్తరిల్లు హృదయాలను మీ ప్రభు వచ్చెనని - ధైర్యముగుండమని దృడపరిచెదం    (2X)
సాతాను కాడిని విరగగొట్టెదం - దుర్మార్గ కట్లను మేం విప్పేదం    (2X)
అగ్ని నుండి జనముల లాగి - ప్రభువును చూపెదం ఇది సత్యం ఆమెన్   
...భూమి...
6.
నరులను పట్టేటి జాలరులుగా మేం - దైవ రాజ్యపు వలలు విసురుతాం   
యేసు రక్తమే పాపము కడుగునని - సర్వ లోకానికి చాటి చెప్పుతాం    (2X)
రారాజుకు రాయబారులం మేము - క్రీస్తేసుతో జత పనివారము    (2X)
యేసు నందలి ఆ నందమే - మాకు బలము ఇది సత్యం ఆమెన్   
...భూమి...