పల్లవి: |
ఇశ్రయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా (2X) |
నేడు మాతో కూడనుండి మమ్ము నడిపించుమా (2X) |
1. |
సొలోమోను దేవాలయములో నీదు మేఘము రాగానే (2X) |
యాజకులు నీ తేజ మహిమకు నిలువ లేకపోయిరి (2X) |
...ఇశ్రయేలు... |
2. |
నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి (2X) |
సిల్వరక్తము చేత మమ్ము రక్షించియుంటివి (2X) |
...ఇశ్రయేలు... |
3. |
పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి (2X) |
నన్ను వెదకని వారికి నే దొరికితి నంటివి (2X) |
...ఇశ్రయేలు... |
4. |
ఆది యపోస్తలులపై నీ యాత్మవర్షము క్రుమ్మరించి (2X) |
నట్లు మాపై క్రుమ్మరించి మమ్ము నడిపించుము (2X) |
...ఇశ్రయేలు... |