« హల్లెలూయ యని పాడి స్తుతింపను
Halleluya yani paadi sthuthimpanu
share with whatsapp

పల్లవి:
హల్లెలూయ యని పాడి స్తుతింపను   
రారె జనులారా మనసారా ఊరూర   
రారే జనులార ఊరూర నోరార    
...హల్లెలూయ...
1.
పాడి పంటలనిచ్చి - పాలించి దేవుడని     (2X)
కూడు గుడ్డల నిచ్చి -పోషించు దేవుడని     (2X)
తోడు నీడగ నిన్ను - కాపాడె నాధుడని     (2X)
పూజించి... పూజించి - పాటించి - చాటించ రారె   
...హల్లెలూయ...
2.
తాత ముత్తాతలకన్న - ముందున్న దేవుడని     (2X)
కల్లాకపటములేని - కరుణ సంపన్నుడని    (2X)
తల్లి దండ్రులకన్నప్రేమించు దేవుడని    (2X)
పూజించి... పూజించి - పాటించి - చాటించ రారె   
...హల్లెలూయ...
3.
బందూ మిత్రులకన్నా - బలమైన దేవుడని    (2X)
అన్నదమ్ములకన్న ప్రియమైన దేవుడని    (2X)
కన్నబిడ్డలకన్న - కన్నుల పండుగని    (2X)
పూజించి... పూజించి - పాటించి - చాటించ రారె   
...హల్లెలూయ...
4.
రాజాధి రాజులకన్న రాజైన దేవుడని     (2X)
నీచాతి నీచులను ప్రేమించవచ్చెనని     (2X)
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని    (2X)
పూజించి... పూజించి - పాటించి - చాటించ రారె   
...హల్లెలూయ...