పల్లవి: |
ఈ సాయం కాలమున యేసు ప్రభో వేఁడెదము |
నీ సుదయా రస మొల్క నిత్యంబు మముఁగావు |
...ఈ సాయం... |
1. |
చెడ్డ కలల్ రాకుండా నడ్డగించు మి |
ప్రభో బిడ్డలము రాత్రిలో భీతి బాపుము తండ్రి |
...ఈ సాయం... |
2. |
దుష్టుండౌ శోధకునిఁద్రొక్కుటకు బలమిమ్ము |
భ్రష్టత్వమున మేము పడకుండఁ గాపాడు |
...ఈ సాయం... |
3. |
నీ యేక పుత్రుండౌ శ్రీ యేసు నామమున |
సాయం ప్రార్ధన లెల్ల సరగ నాలించుమా |
...ఈ సాయం... |
4. |
జనక సుత శుధ్ధాత్మ ఘనదేవా స్తుతింతుం |
అనిశము జీవించిరా జ్యంబుఁ జేయు మామేన్ |
...ఈ సాయం... |