« దేవుని ఉపకారంబులలోన
Dhevuni upakarambulalona
share with whatsapp

పల్లవి:
దేవుని ఉపకారంబులలోన - దేనిని మరువకుము   
ఆయన చేసిన మేలులన్నియు - అనుదినమును ధ్యానించుము   
1.
నిరాశతో మనమున్నప్పుడు - నిరసించిపడియున్నప్పుడు     (2X)
మరణ చాయలో నున్నప్పుడు - మరువకుండ కాపాడెనుగా   
...దేవుని...
2.
వ్యాధులలో మనమున్నప్పుడు - బాధలలో మనమున్నప్పుడు    (2X)
వ్యాధుల బాధల తొలగించి - ఆదరించి కాపాడెనుగా   
...దేవుని...
3.
మహోపకారములన్నియును -యెహోవ దేవుడె చేసెనుగా    (2X)
అహోరాత్రులు ధ్యానించి - మహోన్నతుని స్తుతియించుము   
...దేవుని...