పల్లవి: |
దేవుడు మనకు ఎల్లప్పుడు (2X) తోడుగ నున్నాడు (3X) |
1. |
ఏదేనులో ఆదాముతో నుండెన్ (2X) |
హానోకు తోడ నేగెను (2X) |
దీర్ఘ దర్శకులతో నుండెన్ (2X) |
ధన్యులు దేవుని గలవారు (2X) |
...తోడుగనున్నాడు... |
2. |
దైవాజ్ఞను శిరసావహించి (2X) |
దివ్యముగ నా బ్రాహాము (2X) |
కన్న కొమరుని ఖండించుటకు (2X) |
ఖడ్గము నెత్తిన యపుడు – (2X) |
...తోడుగనున్నాడు... |
3. |
యోసేపు ద్వేషించ బడినపుడు (2X) |
గోతిలో త్రోయబడినపుడు (2X) |
శోధనలో చెరసాలయందు (2X) |
సింహాసనమెక్కిన యపుడు (2X) |
...తోడుగనున్నాడు... |
4. |
ఎర్ర సముద్రపు తీరమునందు (2X) |
ఫరో తరిమిన దినమందు (2X) |
యోర్దాను దాటిన దినమందు (2X) |
యెరికో కూలిన దినమందు (2X) |
...తోడుగనున్నాడు... |
5. |
దావీదు సింహము నెదిరించి |
ధైర్యాన చీల్చినయపుడు |
గొల్యాతును హతమార్చినయపుడు |
సౌలుచే తరుమ బడినపుడు |
...తోడుగనున్నాడు... |
6. |
సింహపు బోనులో దానియేలు (2X) |
షద్రకు మేషా కబేద్నెగో (2X) |
అగ్ని గుండములో వేయబడెన్ (2X) |
నల్గురిగా కనబడినపుడు (2X) |
...తోడుగనున్నాడు... |
7. |
పౌలు బంధించ బడినపుడు (2X) |
పేతురు చెరలో నున్నపుడు (2X) |
అపోస్తలులును విశ్వాసులు (2X) |
హింసించ బడిన యపుడు (2X) |
...తోడుగనున్నాడు... |