పల్లవి: |
దేవాది దేవుడు మహోపకారుడు-మహాత్యము గల మహారాజు (2X) |
ప్రభువుల ప్రభువు – రాజుల రాజు ఆయన కృప నిరంతరముండును |
...దేవాది... |
1. |
సునాద వత్సరము ఉత్సాహ సునాదము- |
నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము (2X) |
ఉత్తమ దేవుని దానములు (2X) |
...దేవాది... |
2. |
యుగములకు దేవుడవు ఉన్నవాడవనువాడవు- |
జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే (2X) |
నీదు క్రియలు ఘనమైనవి (2X) |
...దేవాది... |
3. |
అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసు క్రీస్తు- |
మహిమా మహాత్యములు సర్వాధిపత్యమును (2X) |
సదా నీకే కలుగును గాక (2X) |
...దేవాది... |