పల్లవి: |
దేవా నీ యావరణం మాకెంతో శ్రేయస్కరం |
ఒక ఘడియ యిచ్చట గడుపుట మేలు వేయిదినములకంటెను (2X) |
...దేవా... |
1. |
అద్భుత కార్యములు ఆ.. జరిగించు దేవుడవు ఆ.. |
ఘనవారసకుని మహిమలు పొగడ ఆత్మలో నిలుపుమయా |
ఆత్మతొ సత్యముతో ఆరాధించగ మనస్సుతో |
అల్ఫా ఒమేఘయు ఆత్మరూపుడవు ఆనందించగ నీ మదిలో |
...దేవా... |
2. |
పరిశుద్ధ సన్నీధిలొ ఆ.. పరిశుద్ధాత్ముని నీడలొ ఆ.. |
పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించెదం |
మా దేహమే ఆలయం - కావాలి మీకే నిలయం |
ప్రాణప్రియుడవు - పదముల జేరి ప్రాణార్పణము జేతును |
...దేవా... |
3. |
అత్యంత పరిశుద్ధమౌ ఆ.. నీదు గుడారమున ఆ.. |
నివసించుటకు యోగ్యత నొసగి మమ్ము హెచ్చించితివి నీ దయన్ |
జుంటిధారల కన్నను - తేనే మధురిమలకన్నను |
శ్రేష్టమౌ నీదు వాక్కుల చేత - మమ్ము తృప్తీ పరచుము |
...దేవా... |