« దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా
Dheva mahonnathuda
share with whatsapp

పల్లవి:
దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా   
పది వేలలో అతి సుందరుడా కీర్తింతు మనసారా    (2X)
...దేవా...
1.
వెలిశావు భువిలో మెస్సయ్యగా - ఎడారి బ్రతుకులో సెలయేరుగా    (2X)
నిస్సారమైనా నా జీవితములో చిగురించె ఆనందము   
...దేవా...
2.
వెదికాను నీ దరి ఒంటరినై - నిలిచాను నీ దరి అన్వేసినై    (2X)
నీ దివ్య మార్గం చూపించినా ఫలియించె నా జన్మము   
...దేవా...