« దేవా దేవా నన్ను కావుమా
Dheva dheva nannu kavuma
share with whatsapp

పల్లవి:
దేవా దేవా నన్ను కావుమా    (2X)
నా జీవ యాత్రలో సర్వమై కంటి పాప వలె నా దీపమై   
నీ నీడలో నను నిలుపుమా – నీ ఆత్మతో నను నింపుమా   
...దేవా...
1.
కారు చీకటి మార్గములో భారమైన పయనంలో    
మమత లెరుగని మనుజులలో సిలువ మోయు యాత్రలో    
శృతిని మీటే (నీ) పలుకులే నను    (2X)
పదిలపరచే నన్ను నీ పాద సేవలో యేసువా   
...దేవా...
2.
నీదు మౌన జవాబులలో నీ హృదయ మెరుగుట నేర్పుమ    
యెహోవా యీరే నీవే నా సర్వమై – యెహోవా నిస్సి నా విజయం నీవని    
యెహోవా రోఫెక స్వస్థత నీవై – యెహోవా షమ్మా తోడు ఉందువని   
ఎరుగుటకు ఇల నేర్పుము నీ పాద సేవలో యేసువా   
...దేవా...