« చూడుము గెత్సెమనె
Chudumu gethsemane
share with whatsapp

పల్లవి:
చూడుము గెత్సెమనె - తోటలో నా ప్రభువు   
పాపిని నాకై విజ్ఞాపన చేసెడి - ధ్వని వినబడుచున్నది    (2X)
...చూడుము...
1.
దేహమంతయు నలిగి - శోకము నొందినవాడై   
దేవాది దేవుని ఏకైక సుతుడు పడు - వేదనలు నా కొరకే    (2X)
...చూడుము...
2.
తండ్రి యీ పాత్ర తొలగన్ - నీ చిత్తమైన యెడల   
ఎట్లయినను నీ చిత్తము చేయుటకు - నన్నప్పగించితివనెను    (2X)
...చూడుము...
3.
రక్తపు చెమట వలన - మిక్కిలి బాధనొంది   
రక్షకుడేసు హృదయము పగులగ - విజ్ఞాపనము జేసెనే    (2X)
...చూడుము...
4.
ముమ్మారు భూమి మీద - పడి మిక్కిలి వేదనచే - మన   
యేసు ప్రభువు తానే వేడుకొనెను - పాపుల విమోచన కొరకే    (2X)
...చూడుము...
5.
ప్రేమతో కూడిన వాక్కులచే - ఆదరించెడి ప్రభువు   
వేదన సమయమున ఆదరించువారు - లేక బాధనొందెను    (2X)
...చూడుము...
6.
నన్ను తన వలె మార్చెడి - ఈ మహా ప్రేమను   
తలచి తలచి హృదయము కరుగగా - నే సదా కీర్తించెదను    (2X)
...చూడుము...