పల్లవి: |
చింత లేదిక యేసు పుట్టెను - వింతగను బెత్లెహేమందున |
చెంతజేరను రండి సర్వజనంగమా - సంతస మొందుమా |
...చింత... |
1. |
దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా |
ఖ్యాతి మీరగ వారు యేసుని గాంచిరి - స్తుతు లొనరించిరి |
...చింత... |
2. |
చుక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని గనుగొని |
చక్కగా బెత్లెహెము పురమున జొచ్చిరి - కానుక లిచ్చిరి |
...చింత... |
3. |
కన్య గర్భమునందు బుట్టెను - కరుణ గల రక్షకుడు క్రీస్తుడు |
ధన్యులగుటకు రండి వేగమే దీనులై - సర్వమాన్యులై |
...చింత... |
4. |
పాప మెల్లను పరిహరింపను - పరమ రక్షకుడవతరించెను |
దాపు జేరిన వారి కీడు గడు భాగ్యము - మోక్షభాగ్యము |
...చింత... |