పల్లవి: |
ఏ రీతి స్తుతియింతునో – ఏ రీతి సేవింతునో- |
నేరములెంచని వాడా – నాదు నజరేయుడా- |
తీరము దాటిన వాడా – నాదు గలలీయుడా- |
ఏ రీతి స్తుతియింతునో… (2X) |
అను పల్లవి: |
నా ప్రాణ నాధుండా – నీదు ప్రాణమిచ్చితివి- |
నేను నీ వాడనో యేసువా (2X) |
...ఏ రీతి... |
1. |
మహిమ నగరిని విడిచితివి – మంటి దేహము దాల్చితివి- |
సకల సంపద విడచితివి – సేవకునిగా మారితివి (2X) |
...నా ప్రాణ... |
2. |
వెదకి నను ఇల చేరితివి – వెంబడించగ పిలచితివి- |
రోత బ్రతుకును మార్చితివి – నీదు సుతునిగ జేసితివి (2X) |
...నా ప్రాణ... |
3. |
ఇంత ప్రేమకు కారణము – ఎరుగనైతిని నా ప్రభువా |
ఎన్న తరమా నీ ప్రేమ – సన్నుతించుచు పాడెదను (2X) |
...నా ప్రాణ... |