పల్లవి: |
ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ |
మరణము కంటె బలమైన ప్రేమది - నన్ను జయించె నీ ప్రేమ |
1. |
పరమును వీడిన ప్రేమ - ధరలో పాపిని వెదకిన ప్రేమ |
నన్ను కరుణించి, ఆదరించి, సేదదీర్చి, నిత్య జీవమిచ్చే |
...ఆశ్చర్యమైన... |
2. |
పావన యేసుని ప్రేమ - సిలువలొ పాపిని మోసిన ప్రేమ |
నాకై మరణించి, జీవమిచ్చి, జయమిచ్చి, తన మహిమ నిచ్చే |
...ఆశ్చర్యమైన... |
3. |
శ్రమలు సహించిన ప్రేమ - నాకై శాపము నోర్చిన ప్రేమ |
విడనాడని, ప్రేమది, ఎన్నడు, యెడబాయదు |
...ఆశ్చర్యమైన... |
4. |
నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని జూపిన ప్రేమ |
నాకై పరుగెత్తి, కౌగలించి, ముద్దాడి, కన్నీటిని తుడిచే |
...ఆశ్చర్యమైన... |