పల్లవి: |
ఆలయంలో ప్రవేశించండి అందరు |
స్వాగతం సుస్వాగతం యేసు నామంలో |
మీ బ్రతుకులో పాపమా కలతలా |
మీ హృదయంలో బాధలా కన్నీరా |
మీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం |
...ఆలయంలో... |
1. |
దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై |
వెదికే వారికంతా కనబడు దీపము |
యేసు రాజు మాటలే వినుట ధన్యము |
వినుట వలన విశ్వాసం అధికమధికమై |
ఆత్మలో దాహము తీరెను రారండి |
ఆనందమానందం హల్లెలూయా |
...ఆలయంలో... |
2. |
ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై |
జీవ వృక్షంబుగా ఫలియించాలని |
పెదవితో పలికెదం మంచి మాటలే |
హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై |
నింపెదం నిండెదం కోరెదం పొందెదం |
ఆనందమానందం హల్లెలూయా |
...ఆలయంలో... |