పల్లవి: |
యేసుని స్తుతియించువారు- నిత్య జీవము పొందెదరు |
ఆనందముతో దిన దినము - సంతోషముతొ నుందురు |
అను పల్లవి: |
ఆహా హల్లెలూయ - ఆహా హల్లెలూయా (2X) |
1. |
వాడబారని ఆకువలె - దినదినము బలమొందెదరు |
జీవజలపు నది యొడ్డున - వృక్షములవలె పెరిగెదరు |
...ఆహా... |
2. |
చీకటి నుండి వెలుగునకు - మరణము నుండి జీవముకు |
చేయి విడువక తనతో కూడ - యేసే నడిపించును |
...ఆహా... |
3. |
చీకు చింతలు కలిగినను - చెరలు దుఃఖము కలిగినను |
కనురెప్పవలె కాపాడి - యేసే విడిపించును |
...ఆహా... |
4. |
నడి సంద్రములో పయనించినా - నట్లడవులలో నివసించినా |
ఎన్నడు మరువక ఎడబాయక - యేసే తోడుండును |
...ఆహా... |