« యేసువలె నన్ను మార్చునట్టి
Yesu vale nanu maarchunatti
share with whatsapp

పల్లవి:
యేసువలె నన్ను మార్చునట్టి – ప్రతి అనుభవముకై స్తోత్రం   
శిష్యునిగా నన్ను సిద్ధపరచే – ప్రతి అవమానముకై స్తోత్రం    (2X)
ప్రతి అరణ్యముకై తండ్రీ కృతజ్ఞతలు – అపవాదిపై నాకు జయమిచ్చావు   
ప్రతి ఎడారికై తండ్రీ కృతజ్ఞతలు – జీవజలమై నన్ను తృప్తి పరచావు   
నీవే జీవజలము – తండ్రీ… నీవే జీవజలము    (2X)
1.
నిత్యత్వముకై నన్ను నడిపించే – ప్రతి సవాలుకై స్తోత్రం   
సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి – ప్రతి సమయముకై స్తోత్రం   
ప్రతి కన్నీటికి తండ్రీ కృతజ్ఞతలు – నీ ముఖమును దర్శింప కారణమదే   
ప్రతి ఓటమికి తండ్రీ కృతజ్ఞతలు – నీ సన్నిధిని పొందే సమయమదే   
నీ సన్నిధి చాలు – యేసు… నీ సన్నిధి చాలు    (2X)
2.
విశ్వాసములో నన్ను స్థిరపరచే – ప్రతి పరిస్థితికై స్తోత్రం   
కృప నుండి కృపకు నడిపినట్టి – నీ కనికరముకై స్తోత్రం   
ప్రతి శోధనకై తండ్రీ కృతజ్ఞతలు – నీలో ఆనందించే తరుణమదే   
ప్రతి పరీక్షకై తండ్రీ కృతజ్ఞతలు – నీ విశ్వాస్యత మా యెడ రుజువాయె   
నీవే చాలు యేసయ్యా – నీవుంటే చాలు యేసయ్యా    (2X)