పల్లవి: |
యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా-శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా (2X) |
నమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని (2X) |
...యేసయ్య... |
1. |
పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామం |
పాపిని పవిత్రపరచే – శక్తి కలిగినది యేసయ్య నామం (2X) |
2. |
రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం |
మనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2X) |
3. |
దురాత్మలను పారద్రోలే – శక్తి కలిగినది యేసయ్య నామం |
దుఃఖితులను ఆదరించే – శక్తి కలిగినది యేసయ్య నామం (2X) |
4. |
సృష్టిని శాసించగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం |
మృతులను లేపగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం (2X) |
5. |
పాతాళాన్ని తప్పించే – శక్తి కలిగినది యేసయ్య నామం |
పరలోకానికి చేర్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2X) |