పల్లవి: |
యెహోవా నా మొర లాలించను - దన మహా దయనుననుగణీంచెను |
అహర్నిశల దీన్యహీనూడగు నా - దుహయనెడు ధ్వని గ్రహించమని |
...యెహోవా... |
1. |
పెను పిశాచి కడిమి బడగొట్టెను - దన వశాన నను నిలువబెట్టెను - ప్రశాంత |
మధురసు - విశేష వాక్పల - నిశాంతమున జేర్చి సేద దీర్చెను |
...యెహోవా... |
2. |
మదావళము బోలునామదిన్ - దన ప్రదీప్త వాక్యంకుశాహతిన్ - యదేచ్చలన్నీటి |
గుదించి పాపపు - మెదల్ తుదల్ నరికి దరికి చేర్చెను |
...యెహోవా... |
3. |
అనీతి వస్త్రమెడలించెను - యేసునాధు రక్తమున ముంచెను - వినూత్న |
యత్నమె - దనూని యెన్నడు - గనన్ వినన్ ప్రేమ నాకు జూపెను |
...యెహోవా... |
4. |
విలాపములకు జెవి నిచ్చెను - శ్రమ కలాపములకు సెలవిచ్చెను |
శిలానగము పైకి లాగినను సుఖకళావళుల్ మనసులోన నిలిపెను |
...యెహోవా... |
5. |
అగన్య పాపియని త్రోయక - నన్ను గూర్చి తన సుతుని దాచక |
తెగించి మృతికో - ప్పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగానణంచెను |
...యెహోవా... |