పల్లవి: |
విజయా గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే |
వృజిన మంతటి మీఁద విజయ మిచ్చెడు దేవ నిజకుమారుని నామమున్ |
హృదయములతో-భజన జేయుచు నిత్యమున్ |
...విజయా... |
1. |
మంగళముగ యేసుఁడే మనకు రక్షణ-శృంగమై మరి నిల్చెను |
నింగిన్ విడచి వచ్చెను- శత్రుని యుద్డ రంగమందున గెల్చెను |
రంగు మీరఁగ దన-రక్తబలము వలన-పొంగునణగ జేసెను |
సాతానుని బల్ - కృంగ నలిపి చీల్చెను |
...విజయా... |
2. |
పాపముల్ దొలఁగింపను మనలను దన స్వ-రూపంబునకు మార్పను |
శాపం బంతయు నోర్చెను- దేవుని న్యాయ-కోపంబున్ భరియించెను |
పాపమెరుఁగని యేసు-పాపమై మన కొరకు-పాప యాగము దీర్చెను |
దేవుని నీతిన్ - ధీరుఁడై నెరవేర్చెను |
...విజయా... |
3. |
సిలువా మరణము నొందియు మనలను దనకై-గెలువన్ లేచిన వానికి |
చెలువుగన్ విమలాత్ముని-ప్రేమను మనలో-నిలువన్ జేసిన వానికిఁ |
కొలువుఁజేతుమెగాని -ఇలను మరవక వాణి -సిలువ మోయుచు నీ కృపా |
రక్షణ -చాల విలువ గలదని చాటుచు |
...విజయా... |