« తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును
Thallila laalinchunu thandrila preminchunu
share with whatsapp

పల్లవి:
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును    (2X)
ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును   
చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా   
...తల్లిలా...
1.
తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను   
చూడుము నా అరచేతులలో   
నిన్ను చెక్కియున్నాను    (2X)
నీ పాదము తొట్రిలననీయను నేను   
నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు   
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య   
...తల్లిలా...
2.
పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్ని   
వీడిపోదు నా కృప నీకు   
నా నిబంధనా తొలగదు    (2X)
దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెదా   
నీదు భరమంతా మోసి నాదు శాంతి నొసగెదా   
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా   
...తల్లిలా...