పల్లవి: |
స్తుతించెదను..స్తుతించెదనూ.. |
నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము - స్తుతించెదను (2X) |
1. |
ఉన్నత దేవుడు సర్వాధిపతియు - ఉర్విపరిపాలక |
ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన - ఉత్తమ స్నేహితుని |
ఉదయం సంధ్యా - ఎల్లప్పుడును - ఉత్సాహధ్వనితో పాడెదను (2X) |
...స్తుతించెదను... |
2. |
నాశనకరమైన పాప గుంటనుండి నరక వేదననుండి |
నన్ను విడిపించి నిలిపిన దేవా - నిర్మలా స్వరూప |
నీతి సమాధానం సంతోషముతో - నిత్యజీవము నాకీచ్చితివి (2X) |
...స్తుతించెదను... |
3. |
పాపము క్షమించి రోగము - బాపి భయమును దీర్చి |
పవిత్రదాయక పావనమూర్తి - పరిశుద్ధ మిచ్చిన |
పరమ పాదం శరణ్యం నాకు - పరమరాజా పుణ్యదేవా (2X) |
...స్తుతించెదను... |
4. |
తల్లిగర్భమునకు ముందేర్పరచి -దేహము నమర్చియు |
దక్షిణ బాహుతొ పట్టుకొనిన - దయా సంపూర్ణుడా |
దిక్కు జయము ఆదరణయు -దయతో అనుగ్రహించితివి (2X) |
...స్తుతించెదను... |
5. |
సిలువనెత్తి శ్రమలు సహించ - సేవకు పిలచిన |
స్నేహ దర్శక వీర యోధ - సంశయ హరక |
శ్రమలు నింద ఆకలియైన - నీ స్నేహము నుండి ఎడబాపునా (2X) |
...స్తుతించెదను... |