పల్లవి: |
స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యా (2X) |
నా జీవన దాతకు నను నడిపే ప్రభువుకు (2X) |
1. |
పాపములో పడియున్న వేళ-వదలక వడి చేర్చిన నా దేవా (2X) |
నీ దివ్య కాంతిలో నడిపించిన యేసయ్యా (2X) |
...స్తుతి... |
2. |
సోలిపోయి తూలుతున్న వేళ -జాలితో నను పిలచిన నా దేవా (2X) |
నీ రెక్కల చాటున నను దాచే నాధుడవు (2X) |
...స్తుతి... |
3. |
భువినేలే రారాజు నీవనీ-ఈ ధరలో నే నిన్ను స్తుతింతును |
భువినేలే రారాజు నీవనీ-ధరణిలో నీ మహిమను ప్రకటింతును |
నా హృదయ గానము నీవే యేసని (2X) |
...స్తుతి... |