పల్లవి: |
సీయోను వాసులారా |
అను పల్లవి: |
సకల వాగ్దానములు మనవాయెను |
సాగిలపడి యేసుని ఆరాధించెదము |
1. |
దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో (2X) |
దాని నివాసులుగా మనలను దీవించెన్ (2X) |
...సీయోను... |
2. |
సంతోషించుము దేశమ భయపడవలదు (2X) |
గంతులు వేయుము ఘనకార్యములను చేయున్ (2X) |
...సీయోను... |
3. |
పచ్చిక మొలచును ఫలియించును మరి తరులు (2X) |
ఫలియించును ద్రాక్ష అంజూరపు చెట్లు (2X) |
...సీయోను... |
4. |
తొలకరి కడవరి వర్షము విస్తారముగా (2X) |
తనదు నీతిని బట్టి మనకొసగును (2X) |
...సీయోను... |
5. |
కొట్లు ధాన్యముతో నిండి పొర్లును (2X) |
క్రొత్త తైలము ద్రాక్షరసము పారును (2X) |
...సీయోను... |
6. |
పసరు గొంగలి చీడపురుగులు మిడుతల్ (2X) |
నాశనముచేసిన పంటను మీకొసగును (2X) |
...సీయోను... |
7. |
సర్వ శరీరులపై తన ఆత్మను పోసి (2X) |
స్వప్నముల దర్శనముల మీ కొసగును (2X) |
...సీయోను... |
8. |
సీయోను వాసులు సిగ్గునొందరు (2X) |
శేషము నిలిచి వాసము చేతురు ప్రభులో (2X) |
...సీయోను... |
9. |
ఆ దినమున యెహోవా నామమునందు (2X) |
ప్రార్థించు వారు రక్షణ నొందెదరు |
...సీయోను... |