పల్లవి: |
సిలువలో సాగింది యాత్ర – కరుణామయుని దయగల పాత్ర (2X) |
ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే |
...సిలువలో... |
1. |
పాలుగారు దేహముపైన పాపాత్ముల కొరడాలెన్నో (2X) |
నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి (2X) |
నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ (2X) |
ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే |
...సిలువలో... |
2. |
చెళ్ళుమని కొట్టింది ఒకరు ఆ మోముపై ఊసింది మరియొకరు (2X) |
బంతులాడినారు బాధలలో వేసినారు (2X) |
నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ (2X) |
ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే |
...సిలువలో... |
3. |
వెనుకనుంచి తన్నింది ఒకరు తనముందు నిలచి నవ్వింది మరియొకరు (2X) |
గేలిచేసినారు పరిహాసమాడినారు (2X) |
నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ (2X) |
ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే |
...సిలువలో... |
4. |
దాహమని అడిగింది ప్రేమ చేదు దాహాన్ని ఇచ్చింది లోకం (2X) |
చిరకనిచ్చినారు మరి బరిసెతో గుచ్చారు (2X) |