పల్లవి: |
సర్వలోక నివాసులారా – సీయోనులో స్తుతి చెల్లించుడి |
సంతోష గీతము పాడుడి – దేవుని నామము స్తోత్రించుడి |
అను పల్లవి: |
ఈలాగు దేవుని – స్తోత్రించుడి (2X) |
నీ కార్యములు గంభీరముల్ – నీదు క్రియలు – ఆశ్చర్య కరములు |
నీ నామమునే కీర్తించెదం – నీకు నమస్కరించెదము |
...ఈలాగు... |
1. |
ఆకాశములలొ మహిమ – భువియందు నీ నామ ప్రభావము |
సర్వోన్నతుడు యెహోవా – సాగిలపడి పూజించుడి |
2. |
ప్రేమ స్వరూపి యేసు – ప్రాణార్పణ చేసెను ప్రేమతో |
...ఈలాగు... |
పరిశుద్ధాత్మనుపంపెను – కృతజ్ఞతస్తుతి అర్పించుడి |
3. |
ప్రార్థననాలించువాడు – మన ఆశ్రయము ఆధారము |
పూర్ణ రక్షణ కలిగించె – ఉత్సాహ గానము చేయుడి |
...ఈలాగు... |