పల్లవి: |
సర్వ కృపానిధియగు ప్రభువా-సకల చరాచర సంతోషమా (2X) |
స్తోత్రం చేసి స్తుతించెదను-సంతసమున నిన్ను పొగెడెదను (2X) |
హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ |
హల్లెలూయాయని పాడెదను-ఆనందముతో సాగెదను (2X) |
1. |
ప్రేమించి నన్ను వెదకితివి-ప్రీతితొ నన్ను రక్షించితివి (2X) |
పరిశుద్ధముగ జీవించుటకై-పాపిని నన్ను కరుణించితివి (2X) |
...హల్లెలూయ... |
2. |
అల్పకాక శ్రమలనుభవింప-అనుదినము కృప నిచ్చితివి (2X) |
నాధుని అడగు జాడలలో-నడచుటకు నన్ను పలిచితివి (2X) |
...హల్లెలూయ... |
3. |
మరణ శరీరము మార్పునొంది-మహిమ శరీరము పొందుటకై (2X) |
మహిమాత్మతో నన్ను నింపితివి-మరణభయములను తీర్చితివి (2X) |
...హల్లెలూయ... |
4. |
ఎవరు పాడని గీతమును-యేసుతొ నేను పాడుటకై (2X) |
హేతువు లేకయే ప్రేమించెన్-యేసుకు నేనే మివ్వగలన్ (2X) |
...హల్లెలూయ... |