పల్లవి: |
సంతోష గీతం పాడెదను యేసూ నీ ఘనతను చాటెదను (2X) |
స్తోత్రము చెల్లింతును నీ కీర్తి వినిపింతును (2X) |
...సంతోష... |
1. |
నా ప్రార్దన నీవెపుడు – త్రోసివేయలేదు |
నా యెద్ద నుండి నీ కృపను – తీసివేయలేదు (2X) |
నా విజ్ఞాపన అలించావు-నా మనవి అంగీకరించావు (2X) |
...సంతోష... |
2. |
సమృద్ది ఉన్న ప్రాంతానికి – నన్ను చేర్చినావు |
తొట్రల్లకుండ స్తిరముగను – నిలువబెట్టినావు (2X) |
నను బాగుగ పరిశీలించావు నిర్మలునిగా రూపొందించావు (2X) |
...సంతోష... |