పల్లవి: |
సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో (2X) |
సమానులెవరు ప్రభో |
సమస్త మానవ శ్రమాను భవమును (2X) |
సహించి వహించి ప్రేమించగల (నీ) |
...సమానులెవరో... |
1. |
సమాన తత్వము – సహోదరత్వము (2X) |
సమంజసము గాను మాకు దెలుప (నీ) (2X) |
...సమానులెవరో... |
2. |
పరార్ధమై భవ – శరీర మొసగిన (2X) |
పరోపకారా నరావ తారా (నీ) (2X) |
...సమానులెవరో... |
3. |
దయా హృదయ యీ – దురాత్మ లెల్లరున్ (2X) |
నయాన భయాన దయాన బ్రోవ (నీ) (2X) |
...సమానులెవరో... |
4. |
ఓ పావనాత్ముడ – ఓ పుణ్య శీలుడ (2X) |
పాపాత్ములను బ్రోవ – పరమాత్మ సుత (నీ) (2X) |
...సమానులెవరో... |