పల్లవి: |
సాక్ష్యమిఛ్చెద మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిఛ్చెద (2X) |
సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను దెల్పుటయె (2X) |
సాక్ష్యమిచ్చు కొరకు నన్ను – స్వామి రక్షించెనంచు (2X) |
...సాక్ష్యమిఛ్చెద... |
1. |
దిక్కు దెసయు లేనినన్ను – దేవుడెంతో కనికరించి (2X) |
మక్కువతో నాకు నెట్లు – మన శాంతి నిచ్చినాడో |
...సాక్ష్యమిఛ్చెద... |
2. |
పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు (2X) |
పిల్లలకును బెద్దలకును – బ్రేమతో నా స్వానుభవము |
...సాక్ష్యమిఛ్చెద... |
3. |
బోధ చేయలేను వాద -ములకు బోను నాకదేల (2X) |
నాదుడేసు ప్రభుని గూర్చి – నాకు దెలిసి నంతవరకు |
...సాక్ష్యమిఛ్చెద... |
4. |
పాపులకును మిత్రుడంచు – బ్రాణమొసగి లేచెనంచు (2X) |
బాపముల క్షమించునంచు – బ్రభుని విశ్వసించుడంచు |
...సాక్ష్యమిఛ్చెద... |
5. |
చోరులైన జారుల నాచారులైన నెవ్వరైన (2X) |
ఘోరపాపు లైన క్రీస్తు – కూర్మితో రక్షించు నంచు |
...సాక్ష్యమిఛ్చెద... |
6. |
పరమత దూషణము లేల – పరిహసించి పలుకుటేల (2X) |
ఇరుగు పొరుగు వారికెల్ల – యేసు క్రీస్తు దేవుడంచు |
...సాక్ష్యమిఛ్చెద... |
7. |
ఎల్లకాల మూరకుండ – నేల యాత్మ శాంతి లేక (2X) |
తల్లడిల్లు వారలకును – తండ్రి కుమారాత్మ పేర |
...సాక్ష్యమిఛ్చెద... |
1. |
Sakshya mitchedha-mana swami yEsu dhEvudanchu-Sakshya mitchedha (2X) |
saakshya-manina ganina vinina sangathulanu dhelputaye (2X) |
saakshya-mitchu koraku nannu - swami rakshinche-nanchu (2X) |
...Sakshya... |
2. |
dhikku dhesayu lEni nannu- dhEvudentho kanikarinchi (2X) |
makkuvatho naaku netlu- mana-Shanthi nichchinaado |
...Sakshya... |
3. |
palleToolla janula rakshana-bharamu naa paini galadhu (2X) |
pillalaku beDHdhalakunu - brematho naa swaanubhavamu |
...Sakshya... |
4. |
Bhodha cheyalenu vaadha-mulaku bonu naakadhEla (2X) |
naadhudesu prabhuni goorchi-naaku dhelisi nanthavaraku |
...Sakshya... |
5. |
paapulakunu mithrudanchu- braNa mosagi lEchenanchu (2X) |
baapamula kshaminchuNanchu- braBhuni viShwasinchu danchu |
...Sakshya... |
6. |
chOrulaina jaarula-naachaarulaina neVvaraina (2X) |
Ghorapaapu laina kristhu- KoormithO rakshinchu nanchu |
...Sakshya... |
7. |
paramatha dhooSHaNamu lEla-parihasinchi palukutEla (2X) |
Irugu porugu vaarikella - yEsu Kreesthu dhEvudanchu |
...Sakshya... |
8. |
Ella kaala moorakunda -nEla yathma Shanti lEka (2X) |
thalladillu vaaralakunu - thandri kumaaraathma pEra |
...Sakshya... |