« సాగి పోదును - ఆగి పోను నేను
Saagi podhunu aagi ponu
share with whatsapp

పల్లవి:
సాగి పోదును - ఆగి పోను నేను   
విశ్వాసములో నేను - ప్రార్ధనలో నేడు    (2X)
హల్లెలూయ హల్లేలూయ - హల్లెలూయ హల్లేలూయ    (2X)
1.
ఎండిన ఏడారి లోయలలో - నేను నడిచినను   
కొండ గుహలలో - బీడులలో నేను తిరిగినను    (2X)
నా సహాయకుడు - నా కాపరి యేసే    (2X)
...హల్లెలూయ...
2.
పగలెండ దెబ్బకైనను - రాత్రి వేళ భయముకైనా   
పగవాని బానములకైనా - నేను భయపడను    (2X)
నాదు ఆశ్రయము - నా ప్రాణము యేసే    (2X)
...హల్లెలూయ...
3.
పదివేల మంది పైబడినా - పదిలముగా నేనుండెదను   
ప్రభు యేసు సన్నిధానమే - నాకు ఆధారం    (2X)
నాదు కేడెము - నా కోటయు యేసే    (2X)
...హల్లెలూయ...