« రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
Raaja nee sannidhilone untanayya
share with whatsapp

పల్లవి:
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య   
మనసార ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య   
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య   
నీవె లేకుండా నేనుండలేనయ్య   
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య   
1.
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం   
ఆరాధించుకొనే విలువైన అవకాశం   
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును   
బాధల నుండి బ్రతికించుటకును   
నీవే రాకపోతే నేనేమైపోదునో   
2.
ఓంటరి పోరు నన్ను విసిగించిన   
మనుషులెల్లరు నన్ను తప్పు పట్టినా   
ఓంటరివాడే వేయి మంది అన్నావు   
నేనన్నానులే భయపడకు అన్నావు   
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా   
3.
ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా   
ఏ దారిలొ నడిపిన నీ వెంటే నడిచొస్తా   
విశ్వానికి కర్త నీవే నా గమ్యం   
నీ బాటలొ నడచుట నాకెంతో ఇష్టం   
నిన్ను మించిన దేవుడే లేడయ్య