పల్లవి: |
ప్రేమ యేసుని ప్రేమ - అది ఎవ్వరు కొలువలేనిది |
నిజము దీనిని నమ్ము - ఇది భువి యందించలేనిది |
ఎన్నడెన్నడు మారనిది - నా యేసుని దివ్య ప్రేమ |
ఎన్నడెన్నడు వీడనిది - నా యేసుని నిత్య ప్రేమ |
1. |
తల్లీతండ్రుల ప్రేమ - నీడవలె గతియించును |
కన్నబిడ్డల ప్రేమ - కలలా కరిగిపోవును |
...ఎన్నడెన్నడు... |
2. |
భార్యాభర్తల మధ్య - వికసించిన ప్రేమ పుష్పము |
వాడిపోయిరాలును త్వరలో - మోడులా మిగిలి పోవును |
...ఎన్నడెన్నడు... |
3. |
బంధూమిత్రుల యందు - వెలుగుచున్న ప్రేమ దీపమూ |
నూనె ఉన్నంత కాలము - వెలుగు నిచ్చి ఆరిపోవును |
...ఎన్నడెన్నడు... |
4. |
ధరలోని ప్రేమలన్నియూ - స్థిరముకాదు తరిగి పోవును |
క్రీస్తు యేసు కల్వరి ప్రేమా - కడవరకు ఆదరించును |
...ఎన్నడెన్నడు... |