« ప్రేమ యేసుని ప్రేమ - అది ఎవ్వరు కొలువలేనిది
Prema yesuni prema
share with whatsapp

పల్లవి:
ప్రేమ యేసుని ప్రేమ - అది ఎవ్వరు కొలువలేనిది   
నిజము దీనిని నమ్ము - ఇది భువి యందించలేనిది   
ఎన్నడెన్నడు మారనిది - నా యేసుని దివ్య ప్రేమ   
ఎన్నడెన్నడు వీడనిది - నా యేసుని నిత్య ప్రేమ   
1.
తల్లీతండ్రుల ప్రేమ - నీడవలె గతియించును   
కన్నబిడ్డల ప్రేమ - కలలా కరిగిపోవును   
...ఎన్నడెన్నడు...
2.
భార్యాభర్తల మధ్య - వికసించిన ప్రేమ పుష్పము   
వాడిపోయిరాలును త్వరలో - మోడులా మిగిలి పోవును   
...ఎన్నడెన్నడు...
3.
బంధూమిత్రుల యందు - వెలుగుచున్న ప్రేమ దీపమూ   
నూనె ఉన్నంత కాలము - వెలుగు నిచ్చి ఆరిపోవును   
...ఎన్నడెన్నడు...
4.
ధరలోని ప్రేమలన్నియూ - స్థిరముకాదు తరిగి పోవును   
క్రీస్తు యేసు కల్వరి ప్రేమా - కడవరకు ఆదరించును   
...ఎన్నడెన్నడు...