పల్లవి: |
ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా |
1. |
శ్రేష్ఠమైన భావము గూర్చి - శిష్య బృందముకు నేర్పితివి (2X) |
పరముడ నిను ప్రణుతించెద ప్రియముగ - ప్రభు యేసు ప్రార్థన నేర్పుమయా |
...ప్రార్ధన... |
2. |
పరమ దేవుడవని తెలిసి - కరములెత్తి జంటగా మోడ్చి (2X) |
శిరమును వంచి - సరిగను వేడిన - సుంకరి ప్రార్ధన నేర్పుమయా |
...ప్రార్ధన... |
3. |
దినములోన చేసిన సేవ - దైవ చిత్తముకు సరిపోవ (2X) |
దీనుడవయ్యు - ఒంటిగ కొండను చేసిన ప్రార్ధన నేర్పుమయా |
...ప్రార్ధన... |
4. |
శ్రమలు యేసుని చుట్టుకొని - శత్రుమూక నిను బట్టగను (2X) |
శాంతముతో - శరణనివేడిన - గెత్సెమనె ప్రార్థన నేర్పుమయా |
...ప్రార్ధన... |