పల్లవి: |
ప్రభువా నీవే నమ్మకమైనా సామర్ధ్యుడవు (2X) |
ఎంతో గొప్ప అధ్భుతమైనా ప్రశాంతుడా దయాళుడా (2X) |
...ప్రభువా నీవే ... |
1. |
ఇహపరమందు నివసించువారు నీ నామమున మోకరింతురు (2X) |
మహిమా పరుతురు దేవుని (2X) |
అంగీకరించు ప్రతివాని జిహ్వ నీవే క్రీస్తువనుచు (2X) |
...ప్రభువా నీవే ... |
2. |
అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్ల పరిపాలించుచున్నావు (2X) |
ప్రేమగల ప్రభువా (2X) |
పాపిని రక్షింప యిహమున కరిగి గొప్ప రక్షణనిచ్చె (2X) |
...ప్రభువా నీవే ... |
3. |
ఐగుప్తునుండి విడపించిన వారిని నలువది వత్సరములు నడిపించితివి (2X) |
కాచితివి కనుపాపగ (2X) |
వుంచియున్నావు మాదిరిగా వారిన్ నీ ఆలోచన గొప్పది (2X) |
...ప్రభువా నీవే ... |
4. |
పరమున తెరచి మన్నా కురిపించి అందరికి జీవజలమిచ్చితివి (2X) |
పొందిరి తృప్తి నీయందు (2X) |
అగ్ని స్తంభము మేఘ స్తంభమును నిత్యము నడిపించిను (2X) |
...ప్రభువా నీవే ... |
5. |
తుఫానురేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగ (2X) |
మమ్ములను రక్షించితివి (2X) |
వాగ్ధానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యము నిచ్చితివి (2X) |
...ప్రభువా నీవే ... |