« ఓరన్న… ఓరన్న
Oranna oranna yesuku saati
share with whatsapp

పల్లవి:
ఓరన్న… ఓరన్న    
యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న    
అను పల్లవి:
యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా    (2X)
1.
చరిత్రలోనికి వచ్చాడన్నా – వచ్చాడన్నా   
పవిత్ర జీవం తెచ్చాడన్నా – తెచ్చాడన్నా    (2X)
అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొనును    (2X)
...యేసే...
2.
పరమును విడచి వచ్చాడన్నా – వచ్చాడన్నా   
నరులలో నరుడై పుట్టాడన్నా – పుట్టాడన్నా    (2X)
పరిశుద్దుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను    (2X)
...యేసే...
3.
సిలువలో ప్రాణం పెట్టాడన్నా – పెట్టాడన్నా    
మరణం గెలిచి లేచాడన్న – లేచాడన్న     (2X)
మహిమ ప్రభూ మృత్యుంజయుడు క్షమియించును జయమిచ్చును    (2X)
...యేసే...