పల్లవి: |
ఒకసారి ఆలొచించవా.. ఒ సోదరా |
ఒకసారి ఆవలొకించవా.. ఒ సోదరీ (2X) |
నీ జీవిత మూలమేదో - నీ బ్రతుకు ఆధారమేదో (2X) |
...ఒకసారి... |
1. |
తండ్రి యెహోవా తన్ను పోలి - నిను చేసెను తన వూపిరిలో (2X) |
నా వలెనే నీవు పరిశుద్దముగ - జీవించమని కోరెను |
...నీ జీవిత... |
2. |
దేవుని వదలి దుష్టుని కూడి - లోకము తట్టు మరలి (2X) |
లోక మాయ సంకెళ్ళలో చిక్కి దురాశలలో అణగారితివా |
...నీ జీవిత... |
3. |
లోకము వీడు యేసయ్యన్ చూడు - నిత్య జీవముకై పరుగిడు (2X) |
నేనే మార్గము, సత్యము, జీవమని సెలవిచ్చెను మన మెస్సయ్యా |
...నీ జీవిత... |