పల్లవి: |
ఓ సంఘమా సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమా |
యేసయ్యను ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమా |
ఓ సంఘమా వినుమా |
1. |
రాణి ఓఫిరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతో |
వీణ వాయిద్య తరంగాలతో – ప్రాణేశ్వరుని ప్రసన్నతతో |
ఆనంద తైల సుగంధాభిషేకము (2X) |
పొందితినే యేసునందు (2X) |
...ఓ సంఘమా... |
2. |
క్రీస్తే నిన్ను ప్రేమించెనని – తన ప్రాణ మర్పించెనని |
స్వస్థపరచె నిర్దోషముగా – ముడత కళంకము లేనిదిగ |
మహిమా యుక్తంబుగా నిలువ గోరె యేసుడు (2X) |
సహియింతువా తీర్పునాడు (2X) |
...ఓ సంఘమా... |
3. |
చీకటిలో నుండి వెలుగునకు – లోకములో నుండి వెలుపలకు |
శ్రీకర గుణాతిశయములను – ప్రకటించుటకే పిలిచెనని |
గుర్తించుచుంటివా క్రియలను గంటివా (2X) |
సజీవముగా నున్నావా (2X) |
...ఓ సంఘమా... |
4. |
చల్లగనైన వెచ్చగను – ఉండిన నీకది మేలగునా |
నులివెచ్చని స్థితి నీకుండిన – బయటకు ఉమ్మి వేయబడుదువేమో |
నీ మనసు మార్చుకో తొలిప్రేమ కూర్చుకో (2X) |
ఆసక్తితో రక్షణ పొందుమా (2X) |
...ఓ సంఘమా... |
5. |
కడపటిబూర మ్రోగగానే- కనురెప్ప పాటున మారుదువా- వడిగా |
మేఘాసీనుడవై- నడియాకాశము పోగలవా-గొఱ్ఱెపిల్ల సంఘమా (2X) |
క్రీస్తురాజు సంఘమా- రారాజు నెదుర్కనగలవా (2X) |
...ఓ సంఘమా... |