1. |
ఓ సద్భక్తులారా! లోక రక్షకుండు - బెత్లె్హేమందు నేడు |
జన్మీంచెన్ - రాజాధిరాజు ప్రభువైన యేసు - నమస్కరింప రండి |
నమస్కరింప రండి నమస్కరింప రండి - యుత్సాహముతో |
2. |
సర్వేశ్వరుండు నరరూపమెత్తి - కన్యకు బుట్టి నేడు వేంచేసెన్ |
మానవజన్మ మెత్తిన శ్రీ యేసూ - నీకు నమస్కరించి నీకు |
నమస్కరించి నీకు నమస్కరించి - పూజింతుము |
3. |
ఓ దూతలారా! ఉత్సహించి పాడి - రక్షకుండైన యేసున్ స్తుతించుడి |
పరాత్పరుండా - నీకు స్తోత్రమంచు - నమస్కరింప రండి |
నమస్కరింప రండి నమస్కరింప రండి - యుత్సాహముతో |
4. |
యేసు! ధ్యానించి నీ పవిత్ర జన్మ - మీ వేళ స్తోత్రము నర్పింతుము |
అనాది వాక్య మాయె నరరూపు నమస్కరింప రండి |
నమస్కరింప రండి నమస్కరింప రండి - యుత్సాహముతో |