పల్లవి: |
నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో |
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ ఆమెన్ |
1. |
ఆత్మతో నే పాడెదను - ఆర్భటించి పాడెదను - అభినయించి పాడెదను |
అనుభవించి పాడెదను - అనుదినము నే పాడెదను - అందరిలో నే పాడెదను |
...నూతన... |
2. |
యేసే నా మంచి కాపరి - యేసే నా గొప్ప కాపరి - యేసే నా ప్రధాన కాపరి |
యేసే నా ఆత్మ కాపరి - యేసే నన్ను కొన్న కాపరి - యేసే నాలో ఉన్న కాపరి |
...నూతన... |
3. |
శత్రు సేనలు ఎదురైనా - దుష్టులంతా ఒక్కటైనా - అజేయుడేసుని చేరెదము |
విజయగీతము పాడెదము - ద్వజము నెత్తి సాగెదము - భజన చేయుచు పాడెదము |
...నూతన... |