పల్లవి: |
నిను గాక మరి దేనిని నే ప్రేమింప నీయ్యకు |
నీ కృపలో నీ దయలో నీ మహిమ సన్నిధిలో |
నను నిలుపుమో యేసు |
...నిను... |
1. |
నా తలపులకు అందనిది నీ సిలువ ప్రేమా |
నీ అరచేతిలో నా జీవితం చిత్రించు కొంటివే |
వివరింప తరమ నీ కార్యముల్ |
ఇహ పరములకు నా ఆధారం నీవై యుండగా |
నా యేసువా నా యేసువా |
...నిను... |
2. |
రంగుల వలయాల ఆకర్షణలో మురిపించే మెరుపులలో |
ఆశనిరాశల కోటలలో నడివీధు ఈలోకంలో |
చుక్కాని నీవే నా దరి నీవే నా గమ్యము |
నీ రాజ్యమే నీ రాజ్యమే |
నా యేసువా నా యేసువా |
...నిను... |