పల్లవి: |
నీవు లేని రోజంతా రోజౌనా |
నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా |
నీవు లేని రోజంతా రోజౌన |
...నీవు... |
1. |
జీవజల ఊటయు ప్రభు నీవే |
సత్యము మార్గము ప్రభు నీవే |
నా తోడబుట్టువు ప్రభు నీవే |
నాలోని సంతసం ప్రభు నీవే |
2. |
వెలుగందు జ్వాలయు ప్రభు నీవే |
ధ్వనియు శబ్దము ప్రభు నీవే |
తాళము రాగము ప్రభు నీవే |
మ్రోగెడి కంచుయు ప్రభు నీవే |
3. |
నా క్రియలన్నియూ ప్రభు నీవే |
నాదు బలమంతయూ ప్రభు నీవే |
నా కోట బాటయు ప్రభు నీవే |
నా డాలు కేడెము ప్రభు నీవే |
4. |
నా తలపులన్నియు ప్రభు నీవే |
నా భాష మాటయు ప్రభు నీవే |
నాదు విమోచన ప్రభు నీవె |
నా పునరుత్థానము ప్రభు నీవె |